బెట్టింగ్ వెనుక వైసీపీ ఎమ్మెల్యేలు

SMTV Desk 2017-08-01 14:48:07  YSRCP, Nelluru, Cricket betting, Betting

నెల్లూరు, ఆగష్టు 1: రోజురోజుకు క్రికెట్ బెట్టింగ్ మాఫియా రెచ్చిపోతున్న తరుణంలో ఇటీవల నెల్లూరులో పోలీసులు ఒక ముఠాను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ఇప్పటికే 30మంది బుకీలు, జూదరులను పోలీసులు విచారిస్తుండగా, పలువురు ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల పేర్లు బయటపెట్టినట్లు సమాచారం. ఈ మాఫియా వెనుక వైసీపీ ఎమ్మెల్యేలు, మరికొందరు నేతల పేర్లు బుకీలు వెల్లడించినట్టు పోలీసు వర్గాలు స్పష్టం చేయగా, టీడీపీ వాళ్లను వదిలి వైకాపా నేతలను లక్ష్యం చేస్తున్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపధ్యంలో పోలీసులకు కోట్ల రూపాయలు లంచాలు బుకీలు ఇచ్చారని, ఇందులో కానిస్టేబుళ్ల నుంచి సీఐ, డీఎస్పీ స్థాయి వరకు భాగముందని, ఈ మేరకు టీడీపీ వారిని తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.