కియాపై చంద్రబాబు ప్రశంసలు..

SMTV Desk 2019-01-29 16:56:49  Chandrababu, Kia motors, kia first car release

అనంతపురం, జనవరి 29: కార్ల సంస్థ కియా మోటార్స్ నుంచి ఈరోజే తొలి కారు విడుదలైంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తొలి కారును విడుదల చేసి డ్రైవ్ చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, అతి తక్కువ సమయంలోనే కియా మోటార్స్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టామని చెప్పారు. 2017లో నిర్మాణాన్ని ప్రారంభించిన కియా... అప్పుడే ప్రొడక్షన్ స్థాయికి చేరుకోవడం గర్వకారణం అన్నారు. దక్షిణ కొరియాకు, ఏపీకి ఎన్నో సారూప్యతలు ఉన్నాయని చెప్పారు. కొరియా, ఏపీ ప్రజలు ప్రపంచంలో ఎక్కడైనా నెగ్గుకురాగలుగుతారని తెలిపారు.

ఇక చంద్రబాబు ఆటోమొబైల్ హబ్ గా అనంతపురం ప్రాంతం మారబోతుందనే ఆకాంక్షను చంద్రబాబు వ్యక్తం చేశారు. దక్షిణ కొరియా రాయబారి ఏపీకి బ్రాండ్ అంబాసడర్ గా మారారని కితాబిచ్చారు. పరిశ్రమలను ఆకట్టుకునేందుకు తాము ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీని తీసుకొచ్చామని చెప్పారు. కియా మోటార్స్ కు భారత్ అతి పెద్ద మార్కెట్ అవుతుందని తెలిపారు. కొరియా అధికారులకు, సిబ్బందికి ఏపీని సొంత ప్రాంతంగా భావించాలని సూచించారు. ఈ నేపథ్యంలో ఏపీలో అపోలో టైర్స్, హీరో మోటార్స్, అశోక్ లేల్యాండ్, భారత్ ఫోర్డ్ లాంటి భారీ సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని చెప్పుకొచ్చారు.