ప్రచారకర్తగా పవన్ కల్యాణ్...!!!

SMTV Desk 2017-07-31 19:28:29  Amaravathi, AP Capital city, jivandan, chandrababu, pavankalyan

అమరావతి, జూలై 31: నేడు పవన్ కల్యాణ్ ఉద్దానం సమస్యపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమాశమైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో చంద్రబాబు పవన్ ను జీవన్‌‌ధాన్ ప్రచారకర్తగా ఉండమని కోరారు. ఈ మేరకు పవన్ సీఎం పిలుపును తక్షణమే అంగీకరించారు. పవన్ కళ్యాణ్ ద్వారా ఈ సంస్థ అవయవ దానాన్ని ప్రోత్సహిస్తుంది. ఈ సమావేశంలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి రైతులకు పరిహారం, మంజునాధ కమిషన్ రిపోర్టు, కేంద్రంలో తాజా రాజకీయ పరిణామాల గురించి చర్చించారని సమాచారం. ఈ భేటి దాదాపు గంటకుపైగా జరిగింది.