కోడికత్తి నిందితుడికి ప్రత్యేక సౌకర్యాలు

SMTV Desk 2019-01-25 19:05:16  Jaganmohan Reddy, jagan attack case, special fecelities for accused srinivas, rajhamandry central jai

విజయవాడ, జనవరి 25: ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై గతేడాది అక్టోబర్ లో విశాఖ ఎయిర్ పోర్టులో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు శుక్రవారం ఎన్ఐఏ కోర్టులో హాజరుపరిచారు. నిందితుడు తరపు న్యాయవాదులు దాఖలు చేసిన రెండు మమోలను విచారించిన కోర్టు.. శ్రీనివాస్ కు ఫిబ్రవరి 8వ తేదీ వరకు జుడీషియల్ రిమాండ్ విధించింది.

ఈ నేపథ్యంలో నిందితుడిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. రాజమండ్రి కర్మాగారంలో శ్రీనివాస్ కి భద్రత కల్పించాలని అతని తరపు న్యాయవాదులు కోర్టును కోరారు. అలాగే నిందితుడికి ప్రత్యేక డ్యారక్ తోపాటు పెన్ను, పుస్తకం, న్యూస్ పేపర్ అందించాలని న్యాయవాదులు కోరగా.. అందుకు కోర్టు అంగీకరించింది.