కుంభకోణాలే జగన్ నవరత్నాలు..?

SMTV Desk 2019-01-23 13:57:38  AP Minister, Yanamala ramakrishnudud, YSRCP, YS Jagan mohan reddy, TDP Manifesto

అమరావతి, జనవరి 23: ఏపీ మంత్రి యనమల రామకృష్ణుడు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ మేనిఫెస్టోలో రూపొందించిన నవరత్నాలను తెదేపా కాపీ కొడుతుందంటూ గత కొద్ది రోజులుగా వైసీపీ నేతలు చేసిన ఆరోపణలపై యనమల తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ కుంభకోణాలే జగన్ నవరత్నాలని ఆయన ఎద్దేవా చేశారు.

జగన్ చేసిన నేరాలను కాపీ కొట్టడం ఎవ్వరి వల్లా కాదన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్ కుంభకోణాలకు అంతేలేదన్నారు. రూ.లక్ష కోట్లు, 13 ఛార్జిషీట్లు, 16 నెలల జైలు.. ఇవే జగన్ రికార్డులని, ఇవి తప్ప జగన్ సాధించింది ఏముందని మంత్రి యనమల ప్రశ్నించారు. సమాజానికి చెడు జరగాలని కోరుకునే పార్టీ వైసీపీ అని, అన్నివర్గాల ప్రజలు టీడీపీ వెంటే ఉన్నారని యనమల రామకృష్ణుడు అన్నారు.