బంగారు గుడ్లు పెట్టే హైదారాబాద్‌ నగరాన్ని ఒదిలేసాం : ఏపీ సీఎం

SMTV Desk 2019-01-13 12:53:10  Chandrababu, Amaravati, Hyderabad, Water treatment plant, Iconic bridge

అమరావతి, జనవరి 13: శనివారం ఉదయం ఆంధ్ర రాష్ట్ర మఖ్యమంత్రి చంద్రబాబు రూ. 750 కోట్లతో వాటర్ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. అంతేకాక ఇబ్రహీంపట్నంలోని పవిత్రసంగమం వద్ధ ఐకానిక్‌ బ్రిడ్జి నిర్మాణానికి,అమరావతికి తాగునీటి సరఫరా కొరకు 190 ఎం.ఎల్‌.డి సామర్ధ్యం గల ప్రాజెకుక్టు భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పవిత్ర సంగమం-అమరావతిలను కలుపుతూ కృష్ణానదిపై రు.1387 కోట్లతో నిర్మించే కూచిపూడి ఐకానిక్‌ బ్రిడ్జి విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా రూపొందించటం జరుగుతుందని ఆశా భావం వ్యక్తం చేశారు.





అలాగే నవ్యాంధ్రలో మొదటిగా నిర్మిస్తున్న ఈ బ్రిడ్జి రాష్ట్రంలో మన సాంస్కృతిక సంపద అయినటువంటి కూచిపూడి నృత్యాంను ప్రతిబింబించేలా ఉండాలని డిజైన్‌ రూపొందిం చామని, అందుచేతనే ఈ వంతెనకు కూచిపూడి ఐకాన్‌ బ్రిడ్జిగా నామకరణం చేస్తున్నామని తెలిపారు. బంగారు గుడ్లు పెట్టే హైదారాబాద్‌ నగరాన్ని వదలి ఆర్ధికలోటుతో కొత్త రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. కేంద్రం, ప్రతిపక్షం సహకరించకపోయినా రు.40 వేలకోట్ల విలువగల పనులు రాజధానిలో జరుగుతున్నాయని అన్నారు. రాజధాని నిర్మించలేమని అనుకొన్నారని, అలా ఆశించిన వారు కూడా విభ్రాంతి చెందేలా నిర్మాణాలు చేపట్టామని అన్నారు. ఆ ప్రాంత రైతాంగం నమ్మకంతో 34 వేలఎకరాలు వొక్కరూపాయి లేకుండా ప్రభుత్వానికి అప్పగించారని అన్నారు.