జగన్‌కు దమ్ముంటే కేంద్రంపై పోరాడాలి...??

SMTV Desk 2019-01-12 16:40:54  Nakka anand babu, AP Minister, TDP, YSRCP, YS Jagan mohan reddy, Central government

గుంటూర్, జనవరి 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి అవినీతి చక్రవర్తి అని ప్రచురించిన పుస్తకం పై సంచలన వ్యాఖ్యలు చేశారు తెదేపా మంత్రి నక్కా ఆనంద్ బాబు. రాజా ఆఫ్‌ కరష్షన్‌ తాము వేస్తే దానికి కౌంటర్‌గా జగన్‌ ఈ పుస్తకాన్ని పంచుతున్నారని ఆయన విమర్శించారు.

రాష్ట్ర బడ్జెట్‌కు జగన్ చెబుతున్న అవినీతి లెక్కలకు ఎక్కడా పొంతన లేదన్నారు. జగన్‌కు దమ్ముంటే కేంద్రం పై పోరాడాలని. లేకపోతే తమతో కలసి పోరాటానికి రావాలని ఆయన సవాల్‌ చేశారు.