అసలు జగన్ పాదయాత్రలో ఏముంది : రఘువీర రెడ్డి

SMTV Desk 2019-01-09 17:33:26  Raghuveera reddy sensational comments on ys jagan, YS Jagan prajasankalpa yaatra, APCC

అమరావతి, జనవరి 9: వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గతేడాది చేపట్టిన ప్రజాసంకల్ప యాత్రపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్ పాదయాత్రలో ఏముందని ప్రశ్నించారు. రోజుకి రూ.2కోట్లు ఖర్చు తప్ప.. జగన్ పాదయాత్రలో ఏమీ లేదన్నారు. జగన్ పాదయాత్ర అంతా.. సెల్ఫీలు.. నెత్తిమీద ముద్దులతో నిండిపోయిందని ఎద్దేవా చేశారు.

అనంతరం వచ్చే ఎన్నికల్లో టీడీపీపై పొత్తు ఉంటుందా లేదా అన్న విషయంపై కూడా మాట్లాడారు. ఈ విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని తాము అధిష్టానాన్ని కోరామని.. పొత్తుపై త్వరలో క్లారిటీ వస్తుందని చెప్పారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఓ మిథ్య అని రఘువీరా పేర్కొన్నారు.