అఖిలప్రియకు హోంశాఖ నుండి హెచ్చరికలు

SMTV Desk 2019-01-09 17:22:10  AP Home minister fires on Bhuma akhila priya reddy, Bhuma brahmanandareddy, Home minister Chinaraajappa

అమరావతి, జనవరి 9: ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి చినరాజప్ప, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమ అఖిల ప్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మధ్యే అఖిల ప్రియ అనుచరుల ఇంట్లో పోలీసుల తనిఖీల అనంతరం దానికి నిరసనగా అఖిల ప్రియ తనకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన గన్ మెన్లను వెనక్కి పంపించడంతో ఆమెతో పాటు తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి సైతం అలానే చేశారు. కాగా ఈ పరిణామాలపై చినరాజప్ప స్పందిస్తూ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న అఖిలప్రియ ఇంకా చాలా తెలుసుకోవాలని సూచించారు.

పార్టీలో కానీ ఇతర అంశాల్లో ఏమైనా సమస్యలు ఉంటే పెద్దల దృష్టికి తీసుకురావాలని అంతేకానీ ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించకూడదని ఆయన సూచించారు. ప్రస్తుతానికి భూమా అఖిలప్రియ వ్యవహారం ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి వెళ్లిందని ఆయనే సమస్యను పరిష్కారిస్తారని చెప్పుకొచ్చారు. పార్టీలో క్రమశిక్షణ చాలా ముఖ్యమని దాన్ని ప్రతీ వొక్కరూ పాటించాల్సిందేనని కుండబద్దలు కొట్టారు డిప్యూటీ సీఎం హోంశాఖ మంత్రి చినరాజప్ప.