ప్రత్యేకహోదాపై రాజ్‌నాథ్‌తో సమావేశమైన చలసాని

SMTV Desk 2019-01-05 15:29:59  AP, Special status, Central home minister, Rajnath singh, Chalasani srinivas rao, TDP, YSRCP, Janasena, Chandrababu, YS Jagan, Pawan kalyan

అమరావతి, జనవరి 5: ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రపతికి వివరించాలని, అంతేకాకుండా అఖిలపక్షం మొత్తాన్ని తీసుకెళ్ళి రాత్రపతిని కలిస్తే ఏపీకి ఖచ్చితంగా న్యాయం జరుగతుందని రాష్ట్ర ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ కోరారు. ఈ విషయంలో రాష్ట్రపతి వద్దకు కలిసి రావడానికి పవన్, జగన్ లను వొప్పించే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. శనివారం కేంద్రహోంమంత్రి రాజ్‌నాథ్‌తో చలసాని సమావేశమయ్యారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని, విభజన హామీలు నెరవేర్చాలని, కేంద్రం నిధులతో పోలవరం పూర్తిచేయాలని కోరామన్నారు. హోదా విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని ఈ సందర్భంగా రాజ్‌నాథ్‌ హామీ ఇచ్చారని తెలిపారు. మోదీ అండ్‌ కో ఏపీకి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకిచ్చిన హామీలు అమలు చేసి, రాష్ట్రానికి న్యాయం చేయాలని చలసాని డిమాండ్ చేశారు.