హీరా గ్రూపు కుంభకోణం : ఉగ్రవాదుల హస్తం...???

SMTV Desk 2019-01-04 12:33:23  Noheera shail, Heera group of companies, scam case, Chittor court, Terrorists

చిత్తూరు, జనవరి 4: హీరా గ్రూప్ అధినేత్రి నౌహీరా షేక్‌ హీరా గ్రూపు కుంభకోణం కేసు విచారణలో భాగంగా తనని సిఐడీ పోలీసులు గురువారం చిత్తూరు కోర్టులో హాజరుపరిచిన విషయం తెలిసిందే. ఈ విచారణలో పోలీసులకు విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. నౌహీరా నేతృత్వంలో నడిచిన ఈ సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారిలో ఉగ్రవాదులు కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టిన వారిలో నుంచి ఉగ్రవాదులనే అనుమానం కలిగిన వారి జాబితాను పోలీసులు తయారు చేశారు. ఆ జాబితాను సంబంధిత ఏజెన్సీలకు పంపి నిజాలు తేల్చే పనిలో పడ్డారు.

ఇదిలా ఉండగా ఈ కేసులో విదేశీ డిపాజిట్ల విషయంలోనూ ఫెమా చట్టం ఉల్లంఘన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై ఈడీకి లేఖ కూడా రాశారు. ప్రస్తుతం మహారష్ట్ర పోలీసుల వద్ద నౌహీరా షేక్ ను ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. గతేడాది అక్టోబర్ లో నౌహీరా షేక్ ని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎక్కవ వడ్డీ ఆశ చూపి పలు రాష్ట్రాలలో అమాయకులను మోసం చేసి వేల కోట్లలో డిపాజిట్లు వసూలు చేసిన కేసులో నౌహీరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.