చంద్రబాబు కి యూపీ మంత్రి ఆహ్వానం ..!!

SMTV Desk 2018-12-31 15:10:37  AP Chief Minister, Chandra Babu Naidu, UP minister, Satish mahana,Kumbamela,utterpradesh

అమరావతి, డిసెంబర్ 31: ఏపీ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడికి అరుదైన ఆహ్వానం అందింది. ఉత్తరప్రదేశ్ లో వచ్చే నెల 15 నుంచి ప్రారంభం కాబోతున్న కుంభమేళాలో పాల్గొనాల్సిందిగా చంద్రబాబును ఉత్తర్ ప్రదేశ్ మంత్రి సతీశ్ మహానా ఆహ్వానించారు. సతీష్ మహానా అమరావతిలోని సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రిని కలుసుకున్నారు కాగా ప్రయాగ్ రాజ్ లో ప్రారంభమయ్యే ఈ కుంభమేళాకు రావాలని కోరారు. మంత్రి సతీష్ మహాన విజ్ఞప్తికి సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

కాగా, ఇప్పటికే యూపీ లో జరిగే కుంభమేళాకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కూడా ఆహ్వానించారు. జనవరి 15,2019 నుంచి మార్చి 5 వరకూ ఈ కుంభమేళా జరగనుంది. దీనికి దేశవిదేశాల నుంచి లక్షలాది మంది హిందువులు, సాధువులు వచ్చి పుణ్య స్నానాలు ఆచరిస్తారు.