ప్రేమ వివాహం : కూతురిపై కత్తితో దాడి చేసిన తండ్రి

SMTV Desk 2018-12-28 17:55:46  Nellore, Love marriage, Gooduru, Attempt to murder, Devayaani

నెల్లూరు, డిసెంబర్ 28: నెల్లూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకుందని కన్న కూతురుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు ఓ తండ్రి. పోలీసుల వివరాల ప్రకారం గూడూరులోని జీఎస్ రాయల్ సెంటర్ లో నివాసముంటున్న దేవయాని తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా ఇటీవల కులాంతర వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే దేవయానిపై తండ్రి కత్తితో దాడికి దిగాడు. తీవ్రగాయాలపాలనైన ఆమెను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మిర్యాలగూడలో ప్రణయ్, హైదరాబాద్ లో మాధవిలు కూడా ఇదేవిధంగా కత్తిదాడికి గురయ్యారు. ఈ సంఘటనలు మరవకముందే.. మరో సంఘటన తెలుగు రాష్ట్రాల్లో కలవరం రేపుతోంది.