జనసేన ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోదు : నాదెండ్ల మనోహర్‌

SMTV Desk 2018-12-28 15:58:27  Janasena party, AP Assembly elections, Nadendla manohar

విశాఖపట్నం, డిసెంబర్ 28: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ వేరే ఏ పార్టీ తోను పొత్తు పెట్టుకోదని, వొంటరిగా పోరాడి గెలుస్తాం అని ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్‌ స్పష్టత ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పొత్తుపై అనేక చర్చలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మనోహర్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకోదని అలాగే త్వరలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. జనతరంగం పేరుతో ప్రజలతో మమేకమై కార్యక్రమాలు చేస్తామన్నారు. కాగా త్వరలో పార్టీ కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.