డ్రగ్స్ పై లోకేష్ వ్యాఖ్యలు

SMTV Desk 2017-07-27 15:28:11  Nara Lokesh, comments, on, Drugs, affair

అమరావతి, జూలై 27 : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డ్రగ్స్ వ్యవహారంపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తూ ఉన్నారు. తాజాగా మంత్రి నారా లోకేష్ దీనిపై స్పందించారు. డ్రగ్స్ ఎవరు వాడిన కఠిన చర్యలు తీసుకుంటాం. వారికి శిక్ష కూడా పడుతుందని అన్నారు. డ్రగ్స్ వాడుతూ తమ కుటుంబాలను తామే నాశనం చేసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఈ డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని, జీవితాలను నాశనం చేసుకోవద్దని లోకేష్ తెలియజేశారు.