నేను కోర్టుకు వెళ్లను: ముద్రగడ

SMTV Desk 2017-07-27 15:02:19  Mudragada padmanabham, kapu reservation, Ap CM, paadayaatra

అమరావతి, జూలై 27: ఆగష్టు 2 వరకు ముద్రగడ గృహనిర్భంధం పొడిగించిన నేపధ్యంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ "2వ తేదీ వరకు గృహనిర్భంధం ఉంది కనుక నేను 3వ తేదీ నుంచి పాదయాత్ర చేస్తాను, నాకు నోటీసు కాపి అవసరం లేదు నేను కోర్టుకు వెల్లను, బెయిల్ తెచ్చుకోను ముఖ్యమంత్రి తప్పు చేస్తున్నారు అందుకే 30 స్టేలు తెచ్చుకున్నారు. నాది ఆయన లాంటి జీవితం కాదు" అని అన్నారు. "ఇదంతా చంద్రబాబు నాయుడు ఆయన మాటను నెగ్గించుకోవడానికి చేస్తున్న ప్రయత్నం, గతంలో చాలా మంది పాద యాత్రలు చేశారు వాళ్లు ఎవరైనా అనుమతి కోసం అప్లికేషన్ ఇచ్చారా? మీరు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసారు కదా అప్పుడు మీరు ఇచ్చారా, నాకు చదువు లేదు మీరు నమూనా కాపీ నాకు ఇప్పించండి అప్ప్పుడు నేను అప్లై చేస్తానని" ఆయన చెప్పారు.