గుంటూర్ లో ఘోర ప్రమాదం...నిండు గర్భిని మృతి

SMTV Desk 2018-12-25 11:21:09  Guntoor, Road accident, Yadlapadu mandal, Thimmapuram, Car and tractor

గుంటూరు, డిసెంబర్ 25: నిండు గర్భిని తన శ్రీమంతం పూర్తీ చేసుకొని వస్తుండగా ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటన యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జాతీయ రహదారిపై ట్రాక్టర్‌ను, కారు ఢీకొన్న ఘటనలో కారులో ఉన్న నలుగురు మృతిచెందారు. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

ట్రాక్టర్‌లో ఉన్న మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. మృతులను గుంటూరు గోరంట్లకు చెందిన వారిగా గుర్తించారు. మృతులు జయశ్రీ, అనసూయ, రమాదేవి, డ్రైవర్‌ ఫ్రాన్సిస్‌ ఉన్నారు. కారులో ప్రయాణిస్తున్న వారంతా చిలకలూరిపేట మండలం యడవల్లిలో సీమంతం కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.