ఏపీ ఉత్తమ ఎమ్మెల్యే గా అరిమిల్ల రాధాకృష్ణ

SMTV Desk 2018-12-23 18:48:43  AP, MLA, Best MLA, Arimilla radhakrishna, Nimmala ramanayudu

తణుకు, డిసెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ లో ఉత్తమ ఎమ్మెల్యే గా మరోసారి అరిమిల్ల రాధాకృష్ణ మొదటి స్థానంలో నిలిచారు. తాజాగా రాష్ట్ర ఉత్తమ ఎమ్మెల్యేల జాబితాను విడుదల చేశారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో తణుకు నియోజకవర్గం అగ్రస్థానంలో నిలిచింది. రెండో స్థానంలో పాలకొల్లు నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నిలిచారు. ఉత్తమ ఎమ్మెల్యే జాబితాలో మొదటి స్థానం రావడంపై రాధాకృష్ణ మాట్లాడుతూ..సియంకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో అందిస్తున్నామన్నారు.