జనసేన పార్టీకి గుర్తు కేటాయించిన ఈసీ

SMTV Desk 2018-12-23 10:52:45  Janasena Cheif Pawan Kalyan,Election Commision, Glass Tumbler

జనసేన పార్టీకి ఎలక్షన్ కమిషన్ గుర్తును కేటాయించింది. ‘గాజు గ్లాస్‌ ను జనసే పార్టీ ఎన్నికల గుర్తుగా కేటాయించినట్టు ఆ పార్టీ ధ్రువీకరించింది. దీనికి సంబంధించి జనసేన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆ పార్టీ గుర్తును ప్రకటించింది. జనసేన పార్టీకి ఎలాంటి గుర్తు వస్తుందా అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదైన 29 పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తులను కేటాయించింది. ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్ సారథ్యంలోని జనసేనకు కూడా గాజు గ్లాస్ గుర్తును కేటాయించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 42 లోకసభ నియోజకవర్గాలున్నాయి. 2019లో జరగనున్న ఏపీలోని 25 లోకసభ, తెలంగాణలోని 17 లోకసభ స్థానాలలో ఈ గుర్తుపై పోటీ చేస్తుందని ఈసీ తెలిపింది.