క్రియాశీల రాజకీయాల్లోకి సూరి భార్య..!

SMTV Desk 2018-12-20 18:20:05  Jaganmohan Reddy, YCP, Gangula Banumathi, Poltical Entry

హైదరాబాద్, డిసెంబర్ 20: నాంపల్లి కోర్టు మద్దెలచెర్వు సూరి హత్య కేసుపై తుది తీర్పును ఇవ్వగా, ప్రధాన నిందితుడు అయినా భాను కిరణ్ కు జీవిత ఖైదు విధించింది, ఏ2 గా మన్మోహన్ సింగ్ 5 సంవత్సరాల జైలు శిక్ష విధించబడింది. కాగా, సూరి భార్య గంగుల భానుమతి తన భర్తని చంపిన భాను కిరణ్ వెనుక పరిటాల కుటుంబ సభ్యులు ఉన్నారు అని ఆరోపించారు. సూరి హత్య కేసులో కోర్టు తీర్పు తరువాత రాజకీయ పరిణామాలు మారాయి, ఆయన భార్య భానుమతి క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించడానికి ఎంతో ఆసక్తిగా ఉంది.

ఆమె మాట్లాడుతూ నేను సూరి మర్డర్ కేసు తీర్పు కోసం ఇన్ని రోజులు నా రాజకీయ ప్రవేశం ఆలస్యం చేశానని, ఇప్పుడు రాజకీయాల్లోకి ప్రవేశించాలి అనుకుంటున్నానన్నారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలని బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలి అనుకుంటున్నానని అన్నారు. దీనిపై వైయస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే ఆలోచనలో ఆమె ఉన్నట్లు సమాచారం. తన రాజకీయ ఎంట్రీ కొడుకుకి బలమైన పునాది వేయడానికి ప్రయత్నం అన్న ఊహాగానాలను ఆమె ఖండించింది. నా కుమారుడు విష్ణు వర్ధన్ రెడ్డి ప్రస్తుతం చదువుకుంటున్నాడు, తనని రాజకీయాల్లోకి తీసుకురావాలనుకోవట్లేదు అని ఆమె స్పష్టంచేసారు.