చంద్రబాబుపై కామెడీ చేస్తున్న విజయసాయి రెడ్డి.!

SMTV Desk 2018-12-20 15:43:37  Vijayasai Reddy, Chandrababu

అమరావతి, డిసెంబర్ 20: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని ఉద్దేశించి ఓ పోస్టు పెట్టారు. కామెడీ అంత మీరే చేసి కమెడియన్ల పొట్ట కొట్టకండి సార్ అనే ఫోటో వొకటి పోస్ట్ చేసారు. చంద్రబాబు బహిరంగ సభల్లో మాట్లాడిన కొన్ని మాటలు... అమరావతిలో ఉష్ణోగ్రతలు తగ్గిస్తా, సముద్రాన్ని కంట్రోల్ చేస్తా, ఐఎండి కంటే నా టెక్నాలజీయే గ్రేట్, ప్రకృతిని కంట్రోల్ చేస్తా, తీరం వెంబడి గోడ కడతా అన్న వాటితో ఉన్న ఫోటో వొకటి పోస్ట్ చేసారు. ఈ ఫొటోలో కమీడియన్ సప్తగిరి చంద్రబాబుకి దండంపెడుతూ కామెడీ అంత మీరే చేసి కమెడియన్ల పొట్ట కొట్టకండి సార్ అంటున్నట్లుగా ఉంది.