బలహీనపడిన పెథాయ్.!

SMTV Desk 2018-12-17 17:59:15  Pethai Cyclone

అమరావతి, డిసెంబర్ 17: ఏపీని వణికిస్తున్న పెథాయ్‌ తుపాను క్రమంగా బలహీనపడుతోంది కాకినాడ- యానం మధ్య తీరం దాటి, వొరిస్సా వైపు పయనిస్తుందని అధికారులు తెలిపారు. కాగా, కాకినాడలో భారీవర్షాలు పడుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. సోమవారం రాత్రి లేదా మంగళవారానికి తుఫాన్‌ బలహీనపడుతుందని చెప్పారు. దీని ప్రభావంతో సోమవారం కాకినాడలో సహా గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు భారీవర్షాలు కురుస్తాయని అక్కడక్కడ అతి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది.

ఉత్తర ఆస్ట్రేలియా సమీపంలోని హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారటం వాళ్ళ పెథాయ్ బలహీన పడిందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వాయుగుండానికి కెన్నాంగా అని పేరు పెట్టారు. హిందూ మహాసముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఆస్ట్రేలియాలోని క్వీన్స్ ల్యాండ్ మీదగా తీరం దాటుతుందని అంచనా వేశారు. కానీ అది వాయుగుండంగా మారడం వల్ల పెథాయ్ తీవ్రత తగ్గింది అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం పెథాయ్ బలహీనపడి వొరిస్సావైపు ప్రయాణిస్తుందని సమాచారం.