పేథాయ్ సమాచారం

SMTV Desk 2018-12-15 17:33:48  #CyclonePhethai,amaravathi,chandarababu naidu, chennai,CBN,TDP

అమరావతి , డిసెంబర్ 15 : బెంగాల్ యొక్క ఆగ్నేయ సముద్రంలో ఉన్న తీవ్ర వాయుగుండం నుండి ప్రమాదకర తుఫానుగా మారనున్న "పెథాయి తుఫాను " తూర్పు గోదావరి- కోనసీమ ప్రాంతంలో తీరం దాటే అవకాశం ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. రియల్ టైం గవర్నెన్స్ ద్వారా నిరంతరం ట్రాకింగ్ ఉందని ఎప్పటికప్పుడు సమాచారం మీ అందుబాట్లో ఉంటుందని , భయానకమయిన ఈ తుఫాను పట్ల పౌరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు యుద్దప్రాతిపతికన సేవలందించడానికి సిద్ధంగా ఉన్నారని , ధైర్యం కోల్పోవద్దని, మత్యకారులు వేటకు వెళ్లోద్దని , జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థించారు.


ఈ తుఫాను చెన్నైకి 600 కిమీ దూరంలో, మచిలీపట్టణం కి 800 కిమీ దూరం లో ఉన్నట్లుగా తీరం దాటే సమయంలో గంటకి 150 కిమీ ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, చెన్నై ఆంధ్ర ప్రాంతాల్లో బారినుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు . సహాయం కొరకు హెల్ప్లైన్స్ లైన్స్ కూడా ఏర్పాటు చేసారు .