గంజాయి కొనలేక మొక్కను పెంచాడు

SMTV Desk 2017-07-25 12:02:22  VIJAYAWAADA, DRUGS,TREES.

విజయవాడ, జూలై 25 : ప్రతి రోజు డ్రగ్స్ కేసులో కొత్త కొత్త కోణాలు బయటికి వస్తున్నాయి. తాజాగా ఇలాంటి పరిణామమే చోటుచేసుకుంది. విజయవాడ ప్రాంతానికి చెందిన ఒంగోలు దినేష్(20) కి గంజాయి కొనేందుకు డబ్బులు లేక ఏకంగా ఇంటి వద్ద కుండీలో గంజాయి మొక్కను నాటాడు. ఇంట్లో తల్లిదండ్రులకు అనుమానం రాకుండా ఉండేందుకు ‘వనం-మనం’ కార్యక్రమంలో భాగంగా మొక్కను తీసుకొచ్చి పెంచుతున్నట్టు చెప్పాడు. దినేష్ చదువు మానేసి ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. దినేష్ తో పాటు అతని స్నేహితులు చందు, సుభాష్‌, మహేష్‌ అనే వీరందరూ పాయకాపురం శాంతినగర్‌కు చెందిన మహిళ దగ్గరే గంజాయి కొనుగోలు చేసి తాగుతారని సమాచారం. మరో స్నేహితుడు సతీష్, తన స్నేహితులు గొడవపడి పోలీస్స్టేషన్‌కు వెళ్లారు. ఈ గొడవపై పోలీసులు విచారణ చేసినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇలాంటి వారు 15మందికి పైగా ఉంటారని, వీరంతా గంజాయి, మత్తు కల్గించే మాత్రలు వాడుతున్నారని పోలీసులు తెలిపారు. కొంతమంది యువకులు పలు మందుల దుకాణాల్లో మత్తుమాత్రలు కొనుగోలు చేసి వేసుకుంటున్నారని ఆ యువకులే పోలీసుల విచారణలో వెల్లడించారు. ఈ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయం లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి.