చిందేసిన పవన్ కల్యాణ్

SMTV Desk 2018-11-25 16:30:19  Janasena, Pawan Kalyan

తూర్పుగోదావరి , నవంబర్ 25: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటయాత్రలో భాగంగా పవన్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో పవన్ రాజమహేంద్రవరం నుంచి రంపచోడవరం వరకూ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. బస్సులోని తోటి ప్రయాణికులతో పవన్ కాసేపు ముచ్చటించి.. వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం సుద్ధగొమ్ము గిరిజిన ప్రాంతాలలో పవన్ పర్యటించారు. ఈ సందర్భంగా పవన్ అక్కడికి చేరుకోగానే స్థానిక గిరిజనులు సంప్రదాయ వాయిద్యాలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పవన్ కు గిరిజనులు సంప్రదాయ తలపాగాను బహూకరించారు. పవన్ తలపాగాను ధరించి డోలును వాయిస్తూ.. గిరిజనులతో కలిసి చిందేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను జనసేన తన అధికార ట్విట్టర్ లో పోస్ట్ చేసింది.