ఆనంద ఆంధ్రను చూసి అమెరికా, చైనా, రష్యా కుళ్లిపోతున్నాయి: విజయసాయిరెడ్డి

SMTV Desk 2018-11-23 13:08:27  vijaya sai reddy, ysrcp, ap cm, chandra babu naidu

విజయవాడ, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీకి సరెండర్‌ అయిపోయారని వైఎస్సార్సీ ఎంపి విజయసాయిరెడ్డి విమర్శించారు. రాహుల్‌గాంధీ పాదాల వద్ద వాలిన తీరు చూస్తూంటే యూ-టర్న్‌ అంకుల్‌ మరో చారిత్రక యూ-టర్న్‌కు సిద్ద పడిపోతున్నాడంటూ ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన కాంగ్రెస్‌లోనే తను దొంగిలిచిన టిడిపిని విలీనం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. దేశాన్ని రక్షించాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి ఎవరంటున్నారు అన్ని ప్రశ్నిస్తే తెలిసిపోతుందని, నాలుగున్నర సంవత్సరాలో ప్రజధనాన్ని విచ్చల విడిగా దోచుకుని రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి, ప్రజలను నిరాశ నిస్పృహల్లోకి నెట్టేసిన అరివీర సెడో మీడియా ప్రజాస్వామ్యా వాది చంద్రబాబే అన్నారు. అన్నింటా ఏపి నెంబర్‌.1 జల హారతులు, బోటు రేసులతో రాష్ట్ర ప్రతిష్ట ఎవరెస్ట్‌కి చేరిందన్నారు. ప్రపంచ పటంలో అమరావతికి సింగపూర్‌ పక్కనే చోటు. సంతృప్తస్థాయి 100శాతం దాటేసిందన్నారు. ఆనంద ఆంధ్రను చూసి అమెరికా, చైనా, రష్యా కుళ్లిపోతున్నాయి. చంద్రబాబు ప్రేలాపనలతో ఏం జబ్బో తెలియక డాక్టర్లు బిత్తరపోయారట అంటూ ట్వీట్‌ చేశారు.