అగ్రిగోల్ద్ ఆస్తులపై ఆసక్తికర వాఖ్యలు చేసిన జగన్

SMTV Desk 2018-11-18 15:15:32  Andrapradesh, AP CM, Chandrababu naidu, Nara lokesh, Jagan mohan reddy, Agrigold assets

విశాఖపట్నం, నవంబర్ 18: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, తనయుడు నారా లోకేష్, వాళ్ల బినామీలు అగ్రిగోల్డ్‌ ఆస్తులను కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆరోపించారు. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునే వారే కరువయ్యారని ఆవేదన చెందారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురంలోని పాత బస్టాండ్‌ సెంటర్‌లో భారీ బహిరంగ సభలో అశేష జనాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు అవుతున్నా రాజధానిలో వొక్క శాశ్వత కట్టడం కూడా కట్టలేదని విమర్శించారు. అగ్రిగోల్డ్‌ ఖాతాదారులను సీఎం చంద్రబాబు నాయుడు నిలువునా ముంచారని వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారయణ మండిపడ్డారు. హాయ్‌లాండ్‌ ఆస్తులు తమవంటు మరొకరు రావడం విడ్డూరంగా ఉందని, కోర్టు కళ్లుగప్పి మోసం చేసే స్థాయికి ప్రభుత్వం దిగజారిందని విమర్శించారు.