విజయవాడలో పవన్ పర్యటన

SMTV Desk 2018-11-10 17:17:52  Janasena Party, Pawan Kalyan, Vijayawada, Elections, Pasupuleti Balaraju

విజయవాడ, నవంబర్ 10: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు నుండి రెండు రోజుల వరకు విజయవాడలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో జనసైనికులు, పార్టీ నేతలతో కలిసి పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ బలేపేతంతో పాటు అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని వెళ్లే విధంగా వ్యూహరచన చేయనున్నారు.

ఇతర పార్టీల నుంచి వలసలు వస్తున్న వారిని పార్టీలోకి ఆహ్వానించేందుకు అనుసరించాల్సిన పద్ధతులను నేతల నుంచి తెలుసుకోనున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, విశాఖ జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు ఆ పార్టీకి రాజీనామా చేసి… తన రాజీనామా లేఖను కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌గాంధీకి శుక్రవారం పంపించారు. దీంతో నేడు పవన్ సమక్షంలో జనసేనలో చేరనున్నారు.