జగన్ ‘ప్రజా సంకల్ప యాత్ర’ పున:ప్రారంభం

SMTV Desk 2018-11-09 17:39:35  YSRCP, Jagan, Praja Sankalpa Yatra, Attempt to Murder

అమరావతి, నవంబర్ 09: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం నుంచి ప్రజా సంకల్ప యాత్రను పున: ప్రారంభించనున్నారు. ఏడాది కాలంగా పాదయాత్ర చేస్తున్న జగన్ పై గత నెలలో విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. దీంతో ఆయన చేతికి గాయం ఏర్పడటంతో యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో విశ్రాంతి తీసుకుంటున్నారు.

పూర్తి స్థాయిలో జగన్ కోలుకోవడంతో తిరిగి ‘ప్రజా సంకల్ప యాత్ర ను ఈ నెల 12 నుంచి కొనసాగించనున్నారు.. వాస్తవానికి నవంబర్ 3 నుండే పాదయాత్ర ప్రారంభించాల్సి ఉండగా.. ఆరోగ్యపరమైన కారణాలతో మరికొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్నారు జగన్. విజయనగరం జిల్లాలో ఈ యాత్ర కొనసాగనుంది. యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలను తెలియజేయాల్సిఉంది. యాత్ర పున:ప్రారంభించిన రోజే బహిరంగ సభ పెట్టనున్నట్లు తెలుస్తోంది.