జగన్ దాడిపై తీవ్ర విమర్శలు చేసిన ఏపీ మంత్రి

SMTV Desk 2018-11-08 10:26:03  YSRCP, Jagan Mohan Reddy, Aadinarayana Reddy

అమరావతి, నవంబర్ 8: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన కత్తిదాడిపై ఏపీ మంత్రి, రాయలసీమ నేత ఆదినారాయణ రెడ్డి విమర్శలు చేశారు. ఈ కోడికత్తి దాడి సినిమాను తలపించేలా వుంది అంటూ ఆరోపించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… వైసీపీ వాల్లకి కనీసం అవగాహన కూడా లేకుండా ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారు… విశాఖ పోలీసు కమిషనర్‌ మహేష్‌చంద్ర‌ లడ్డా ఎవరిమాట వినకుండా నిష్పక్షపాతంగా విచారణ జరిపే అధికారి అనే విషయాన్ని వైసీపీ నేతలు గుర్తుంచుకోవలన్నారు.

ఏపీ పోలీసు అధికారులు సీఎం చంద్రబాబు చెప్పుచేతల్లో ఉన్నారంటూ ఆరోపణలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఏపీ పై కేంద్ర చూపిస్తున్న వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారన్నారు… కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై కేంద్రం స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే రూ.15 వేల కోట్లతో నెల రోజుల్లో శంకుస్థాపన చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్న ఇతర పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని పల్లెత్తి మాట అనకపోవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు.