తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిన బీజేపీ

SMTV Desk 2018-11-01 13:33:18  Statue Of Unity, Sardar Vallabhai Patel, Nara Lokesh, Narendra Modi, Telugu Language

అమరావతి,నవంబర్ 1: భారత తొలి ఉప ప్రధాని, హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్నిభారత ప్రధాని నరేంద్ర మోదీ బుదవారం అట్టహాసంగా ఆవిష్కరించారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 183 మీటర్ల పొడవుతో ఈ విగ్రహాన్ని నిర్మించారు.



అయితే భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో మూడో స్థానంలో ఉన్న తెలుగుకు స్టాట్యూట్‌ ఆఫ్‌ యూనిటీ వద్ద గుర్తింపు లభించకపోవడం తెలుగు బిడ్డగా తన మనసు క్షోభిస్తోందని ఏపీ మంత్రి నారా లోకేశ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి విషయాల్లో కూడా తెలుగువారంటే కేంద్రానికి ఇంత వివక్షా? అని నిలదీశారు. ప్రతి వొక్క తెలుగు వ్యక్తి తన ఆవేదనను వ్యక్తం చేయాల్సిన తరుణమిదని అన్నారు. ప్రపంచంలో అతి ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో నరేంద్ర మోడీ సఫలీకృతం అయ్యారు.. కానీ పటేల్‌ సమైక్య స్ఫూర్తిని కాపాడటంలో మాత్రం విఫలమయ్యారని విమర్శించారు. ఐక్యతా ప్రతిమ ఏర్పాటులో తెలుగుని విస్మరించడం ద్వారా బీజేపీ తెలుగువారి ఆత్మగౌరవాన్ని మరోసారి దెబ్బతీసిందని లోకేశ్‌ ఆక్షేపించారు.