ట్రైన్ యాత్రకు సిద్దమయిన జనసేన అధ్యక్షుడు

SMTV Desk 2018-10-31 11:16:37  Janasena, Pawan kalyan, Elections,

విజయవాడ, అక్టోబర్ 31: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాబోతున్న ఎన్నికల సందర్భంగా రైలు యాత్ర చేయడానికి సిద్దం అవుతున్నారు. నవంబర్ 2న విజయవాడ నుంచి తుని వరకు ట్రైన్ జర్నీ చేయనున్నట్లు జనసేన పార్టీ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. నవంబర్ 2న మధ్యాహ్నం 1.20 గంటలకు జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో పవన్ ప్రయాణం సాగనుంది…రైలులో ప్రయాణించి సాయంత్రం 5.20 గంటలకు తుని చేరుకుంటారు. ఈ ప్రయాణంలో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ… జనసేన పార్టీ ఆశయాలకు వారికి వివరించనున్నారు.

ఈ నేపథ్యంలో జనసేనాని అధికారికంగా ఫేస్‌బుక్‌ పేజీని మంగళవారం ప్రారంభించి తొలి పోస్టుగా తుని రైలు ప్రయాణ వివరాలను విడుదల చేశారు. పర్యటన వివరాలు, పార్టీ సిద్ధాంతాలను నెటిజన్లకు వివరించేందుకు ఈ పేజీని ప్రారంభించినట్లు పవన్ తెలిపారు. ఏపీలో ఇప్పటికే వైసీపీ అధినేత జగన మోహన్ రెడ్డి ప్రభంజనం కొనసాగుతున్న నేపథ్యంలో మొన్న ఎయిర్ పోర్ట్ లో ఆయన పై హత్యయత్నం జరిగిన విషయం తెలిసిందే… ఇలాంటి సమయంలో పవన్ యాత్రకు ఎలాంటి ఆటకం కలగకుండా ఏపీ పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.