ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టు ఆదేశాలు

SMTV Desk 2018-10-29 15:54:07  HIGH COURT, SUPREEM COURT, CENTRAL GOVERNAMENT, NOTIFICATIONS

హైదరాబాద్, అక్టోబర్ 29: ఉమ్మడి హైకోర్టు విభజనపై సుప్రీంకోర్టులో ఈరోజు కీలక విచారణ జరిగింది.అమరావతిలో నిర్మిస్తున్న తాత్కాలిక హైకోర్టు భవనాల పనులు పూర్తయ్యాక హైకోర్టు విభజనకు నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఈ నేపథ్యంలో డిసెంబర్‌ 15లోగా అమరావతిలో హైకోర్టు తాత్కాలిక భవన నిర్మాణం పూర్తి చేస్తామని ఏపి ప్రభుత్వం చెప్పింది. న్యాయాధికారుల విభజనపై ఇప్పటికే నోటిఫికేషన్‌ విడుదలైందని ఏపీ తరపు న్యాయవాది నారీమన్‌ వివరించారు.