ఏపీ పోలీసులకు షాక్ ఇచ్చిన జగన్...

SMTV Desk 2018-10-26 16:50:31  ysrcp, jagan, ap police, chandrababu

హైదరాబాద్, అక్టోబర్ 26: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న విశాఖలో తన పై దాడి జరిగిన తర్వాత హైదరాబాద్ కు చేరుకొని సిటీ న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఈ రోజు మధ్యాహ్నమే డిశ్చార్జ్ అయ్యారు. ఆ సమయలో జగన్ అభిమానులు, పార్టీ నేతలు ఆసుపత్రికి తరలి వొచ్చారు. ముఖ్యమంత్రి (చంద్రబాబు) డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. తెలుగుదేశం ప్రభుత్వానికి, చంద్రబాబుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకుముందు వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఏపీ పోలీసులకు స్టేట్‌మెంట్ ఇచ్చేందుకు ఇష్టం లేదని చెప్పారు. జగన్ కూడా స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. ఏదైనా ఇతర ఏజెన్సీతో కలిసి వస్తే వాంగ్మూలం ఇస్తానని చెప్పారు.





జగన్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ శివారెడ్డి తెలిపారు. గురువారం రాత్రి గాయం కారణంగా జగన్ నొప్పితో ఇబ్బంది పడ్డారని, ఇప్పుడు పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. పెయిన్ కిల్లర్ ఇచ్చామన్నారు. గాయం మానడానికి కొంత సమయం తీసుకుంటుందని చెప్పారు. కండరానికి, చర్మానికి కలిపి ఎనిమిది కుట్లు పడ్డాయన్నారు. రక్తం నమూనాలను ల్యాబ్‌కు పంపించామని చెప్పారు. డిశ్చార్జ్ అయ్యాక కూడా జగన్ టెస్టులకు రావాల్సి ఉంటుందని చెప్పారు. నార్మల్‌గానే వచ్చి, గాయం మాని కుట్లు తీసే వరకు విశ్రాంతి తీసుకోవాలన్నారు.

జగన్ డిశ్చార్జ్ అయినప్పటికీ 5 రోజులు విశ్రాంతి తప్పకుండా తీసుకోవాలని తెలిపారు. కాగ జగన్ తల్లి వైఎస్ విజయమ్మ, అలాగే తమ కుటుంబ సభ్యులు కొద్ది రోజుల పాటు తన పాదయాత్రను వాయిదా వేసుకొని గాయం తగ్గిన తరువాత పాల్గొనమని కోరారు. దానికి జగన్ తన పాదయాత్ర వారం రోజులకి వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

తరువాత జగన్ తన నివాసం లోటస్ పాండ్ కి చేరుకున్నారు. తన స్టేట్‌మెంట్ కోసం విశాఖపట్నం నుండి పోలీసు బృందం అకడికి వచ్చింది. కానీ జగన్ మాట్లాడుతూ ఏపీ పోలీసులపై, అలాగే చంద్రబాబు ప్రభుత్వం పై తమకు నమ్మకం లేదని మా నేతలు చెబుతున్నారని , మీకు నేను ఎటువంటి స్టేట్‌మెంట్ ఇవ్వదలుచుకోలేదు అని చెప్పారు. కాగా తెలంగాణ పోలీసులపై తమకు ఎటువంటి అనుమానం లేదని వారికి అయితే స్టేట్‌మెంట్ ఇస్తాను అని చెప్పుకొచ్చారు. ఇది విన్న ఏపీ పోలీసు బృందం ఆశ్చర్యంతో తిరిగి వెళ్ళిపోయారు.