జగన్ పై దాడికి ఏపీ లో పలుచోట్ల నిరసనలు...

SMTV Desk 2018-10-25 17:33:16  ANDRAPRADESH, JAGAN,

ఆంధ్రప్రదేశ్, అక్టోబర్ 25: వైఎస్ జగన్ పై జరిగిన దాడికి ఏపీ లో పలుచోట్ల పార్టీ కార్యకర్తలు, శ్రేణులు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపారు.అలాగే మరికొన్ని చోట్ల ర్యాలీలు, ధర్నాలు చేశారు. కాగా వొంగోలు జాతీయ రహదారిపై వైసీపీ కార్యకర్తలు రాస్తారోకో చేశారు. దాంతో హైవే పై ట్రాఫిక్ పెద్ద మొత్తంలో ఏర్పడింది. చిత్తూరు జిల్లాలో కూడా జగన్ పై దాడికి నిరసనగా గాందీ విగ్రహం, పూలే విగ్రహం వద్ద నిరసనలు చేశారు. శ్రీకాళహస్తి గాలి గోపురం వద్ద పార్టీ కార్యకర్తలు నిరసన తెలిపారు. పుంగనూరులో వైసీపీ వర్గాలు రాస్తారోకో చేశారు. నేతలు దాడిని తీవ్రంగా ఖండించారు. చిన్నగొట్టి గల్లు మండలం భాకరాపేటలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాష్కర్ రెడ్డి ధర్నా చేశారు.



ఈ దాడి హేయమైన చర్య, చాలా బాధాకరమని వైసీపీ నేత, ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి ఖండించారు. పార్టీతో పాటు రాష్ట్ర ప్రజలు ఆందోళనలో ఉన్నారని తెలిపారు. వెంటనే దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. జగన్ పై దాడిని విజయనగరం మాజీ ఎంపీ బొత్సా ఝాన్సీ ఖండించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో దాడికి నిరసనగా నల్ల బ్లాడ్జిలతో ర్యాలీ చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో నిరసనలు తెలిపారు. దాడికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఇలా జగన్ కు తమ అభిమానులు, తమ పార్టీ నేతలు కలిసి ఏపీలో ఆందోళనలు చేస్తున్నారు.