ఆదర్శంగా నిలిచిన కలెక్టర్

SMTV Desk 2017-07-20 13:32:57  The, collector, wife, is, treated, at, a government, hospital

ఒంగోలు, జూలై 20 : ప్రజలు ప్రభుత్వాసుపత్రి లో వైద్యం చేయించుకోవాలంటే భయపడుతున్నారు. ప్రజలు ఎంత ఖర్చు అయిన సరే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళడానికి సిద్దపడుతున్నారు. అలాంటిది ఒక కలెక్టర్ తన భార్యకు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ విజయ్ చంద్ తన భార్య కీర్తికి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స చేయించి అందరికి స్పూర్తినిచ్చారు. ఒంగోలు లోని రిమ్స్ వైద్యశాలలో ఆమెకు కుటుంబ నియంత్రణ చికిత్స చేయించారు. డాక్టర్ మాదాసి వెంకటయ్య ఈ ఆపరేషన్ చేసి, ఆమెను బుధవారం సాయంత్రం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. కీర్తికి ఆపరేషన్ జరుగుతున్న సమయంలో కలెక్టర్ విజయ్ చంద్ తో పాటు డీహెచ్ ఎంఓ డాక్టర్ యస్మిన్, రిమ్స్ డైరెక్టర్ వల్లీశ్వరి ఆసుపత్రిలోనే ఉన్నారు.