డాక్రా బజారు ఆవిష్కరణ: పరిటాల సునీత

SMTV Desk 2018-10-12 13:29:29  paritala sunitha,Dakra Market, Unveiled

మెప్మా,అక్టోబర్ 12: గ్రామీణాభివృద్ధి సంస్థ (సెర్ప్‌) సంయుక్త ఆధ్వర్యంలో గురవారం అఖిల భారత డ్వాక్రా బజార్‌ - 2018 ప్రారంభమైంది. ఈ డాక్రా బజారును రాష్ట్ర స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత ఆవిష్కరించారు . డ్వాక్రా బజారును గద్దె అనురాధ, జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్రావు, క్రీడా, న్యాయ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, మేయర్‌ కోనేరు శ్రీధర్‌తో కలిసి సందర్శించారు.

ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ రెండేళ్లుగా నిర్వహిస్తున్న ఈ డ్వాక్రా బజార్లో గత సంవత్సరం రూ.కోటికి పైగా ఆదాయం రాగా, ప్రస్తుతం అంతకు మించిన ఆదాయం వస్తుందని ఆమె అభిప్రాయాన్ని వెల్లడించారు . అనంతరం అఖిల భారత డ్వాక్రా బజార్‌ - 2018 నగర వాసులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వస్తోన్న దుర్గమ్మ భక్తులను కూడా అమితంగా ఆకర్షిస్తున్నాయి అని చెప్పారు.


పూతరేకుల్లో ఆత్రేయ పురానికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఆ బ్రాండ్‌ ఇమేజ్‌కు తగ్గకుండా మా పూతరే కులను గత 40 ఏళ్లుగా కొనసాగిస్తున్నాం. దాదాపు పదేళ్లుగా ఈ డ్వాక్రా బజార్ల ద్వారా కూడా రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతా లకు కూడా ఆత్రేయపురం పూతరేకుల రుచిని పరిచయం చేస్తున్నాం. వాటితో పాటు మామిడి, తాటి తాండ్ర, రేగి పండ్ల వడియాలు ఇలా పలు రకాల ఆహార పదార్థాలతో ఆహా.. అనిపించుకుంటున్నాం.

ఈ డ్వాక్రా బజార్లోని 320 స్టాల్స్‌లో రూ.4కోట్లకు పైగా విలువైన ఉత్పత్తులను ఉంచారు అని తెలియచేసారు . పనస పండుతో చేసిన కేరళ ప్రాన్స్‌ ఫ్రై, హల్వా, బనానా చిప్స్‌, ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజాలు భోజన ప్రియులకు ఆహ్వానం పలుకుతున్నాయి. కూచిపూడి, భరతనాట్యంతో పాటు పాశ్యాత్య సంగీత కార్యక్రమాలు, మిమిక్రీతో పాటు చిన్నారులను ఆకట్టుకునే పలు కార్యక్రమాలను ఏర్పాట్లు జరిగాయి. 11 రోజుల పాటు జరిగే ఈ చేతి వృత్తుల ఉత్సవంలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఏపీలోని 13 జిల్లాలు, దక్షిణ భారతదేశం నుంచే గాక ఉత్తర భారతీయ వనితలు కూడా విచ్చేశారు. కేరళ, కర్ణాటక, గోవాతో పాటు అరుణాచల్‌ ప్రదేశ్‌, జమ్మూ, కాశ్మీర్‌, మధ్యప్రదేశ్‌ వంటి తదితర ప్రాంతాల నుంచి తరలివచ్చిన నివాస అలంకరణలు, హ్యాండ్‌మేడ్‌, టెంపుల్‌ జ్యూయలరీ, హెర్బల్‌ ప్రోడక్ట్స్‌, క్రిస్టల్‌ బ్యాగ్స్‌, మహరాజా ఫర్నీచర్‌, పేపర్‌ క్రాఫ్ట్స్‌, మిల్లెట్‌ ప్రోడక్ట్స్‌ ఇలా వొకటి రెండు కాదు.. ఏకంగా 700 రకాల విభిన్న ఆకృతులు, కళాఖండాలు విక్రయానికి సిద్ధమయ్యాయి.

ఢిల్లీ యూనివర్సిటీలో ఐదేళ్ల క్రితం గార్మెంట్‌ డిజైన్‌ కోర్సును పూర్తి చేశాను. అయితే ఈ సహజ సిద్ధంగా లభించే కొబ్బరి, వరి, చీపురు పుల్లలు, ఆకులు, మొక్కజొన్న రేకులను ఉపయోగించి పలు రకాల పూల కుండీలు, నివాస అలంకరణలను తయారుచేస్తుంటాం. దేశంలోనే అతి పెద్ద ఎగ్జిబిషన్‌గా పేరుగాంచిన ఢిల్లీలో జరిగే ప్రగతి మైదాన్లోనూ మా ప్రోడక్ట్స్‌ను పరిచయం చేశాం. దీనికి చాల గర్వంగా ఉందని తెలియచేసారు .