పార్లమెంట్ లో డ్రగ్స్ పై విజయ సాయి రెడ్డి

SMTV Desk 2017-07-19 18:30:33  Vijay Sai Reddy, on, Drugs, in, Parliament

అమరావతి, జూలై 19 : ఇటీవల కొంత మంది డ్రగ్స్ బానిసలవుతున్న నేపధ్యంలో వాటికీ ముగింపు పలుకడానికి కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి కోరారు. రాజ్య సభలో ఆయన మాట్లాడుతూ జర్మనీ, యూకే వంటి దేశాల నుంచి డ్రగ్స్ దిగుమతి అవుతున్నాయి. వాటికీ ఎక్కువగా విద్యార్ధులు బానిసలవడం ఆందోళన కలిగించే విషయం అని అన్నారు. హైదరాబాద్ లో డ్రగ్స్ విషయం కలకలం రేపుతుంది. ఇందులో సినిమా నటులు కూడా డ్రగ్స్ బానిసలవుతున్నారు. ఈ అంశం పై కూడా అయన పార్లమెంట్ లో మాట్లాడారు. ఏపీ,తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో డ్రగ్స్ ను అరికట్టాలని అయన కేంద్రం ను కోరారు.