శోకసంద్రంలో టీడీపీ !!!!

SMTV Desk 2018-10-03 12:19:42  tdp, died leder,sad

హైదరాబాద్ ,అక్టోబర్ 03: రోడ్డు ప్రమాదంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఎంవీవీఎస్ మూర్తి మృతి చెందారు. అమెరికా పర్యటనలో ఉన్న మూర్తి కాలిఫోర్నియా నుంచి అలస్కా కు వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని మరొక వాహనం ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ఆయనతో పాటు వాహనంలో ఉన్న బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వి.బి.ఆర్ చౌదరి కూడా అక్కడికక్కడే కన్నుమూశారు. గీతం విద్యాసంస్థల అధిపతిగా ఎంవీవీఎస్ మూర్తి అందరికీ సుపరిచితులు. ఆయన మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ప్రస్తుతం ఆయన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నారు. ఈనెల 6వ తేదీన అమెరికాలో జరగనున్న గీతం విద్యాసంస్థల పూర్వసమ్మేళనంలో మూర్తి పాల్గొనాల్సి ఉంది.