ఆరోగ్య పథంలో ఆంధ్రప్రదేశ్

SMTV Desk 2017-07-19 16:32:26  Health, in, Andhra Pradesh

అమరావతి, జూలై 19 : ఆంధ్రప్రదేశ్ లోని గ్రామీణ ప్రాంతాలకు వైద్య సేవలు అందించడం కోసం ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ ( ఏపీఎమ్ డీసీ) అత్యాధునిక అంబులెన్స్ లను ఏర్పాటు చేసింది. ఈ అంబులెన్స్ లను సీఎం చంద్రబాబునాయుడు ప్రారంభించారు. ఈ అంబులెన్స్ కు ఆరోగ్య రథం అని పేరు పెట్టారు. రూ. 45 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ అంబులెన్స్ లను చంద్రబాబునాయుడు పరిశీలించారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ఏపీఎమ్ డీసీ వీటిని స్థాపించినందుకు చంద్రబాబునాయుడు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో వ్యాధులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని ఎక్కువగా ఉపయోగించాలని సూచించారు. ఈ వాహనంలో రోగులకు మందులు ఇవ్వడంతో పాటు కేన్సర్ నిర్ధారణ సహా 200 రకాల పరీక్షలను నిర్వహించే అవకాశం ఇందులో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో గనుల శాఖ మంత్రి సుజయకృష్ణ రంగరావు, స్వచ్చంద కార్పోరేషన్ సీఎల్ వెంకట్రావ్ ఈ ఇందులో పాల్గొన్నారు.