ఆ ముగ్గురు కలిసే కుట్ర చేస్తున్నారు: మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

SMTV Desk 2018-09-14 12:31:58  Pratti pati Pullarao,Modi, KCR, YS Jagan, Babri Project, Chandra Babu Naidu , Andhrapradesh,

గుంటూరు: ఎనిమిదేళ్ల క్రితం బాబ్లీ ప్రాజెక్టు వద్ద జరిగిన ఘర్షణలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా 16 మంది నిందితులకు 21వ తేదీలోపు కోర్టులో హాజరు కావాలని ధర్మాబాద్ కోర్టు నోటీసులు పంపించిన విషయమ తెలిసిందే. అయితే ఇది మోడీ చేసిన కుట్రలో భాగమేనని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ సందర్బంగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ మోదీ, జగన్‌, కేసీఆర్‌ కలిసి చంద్రబాబును ఇబ్బంది పెట్టాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ కుట్రలను చంద్రబాబు చేధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. రైతుల కోసం మహారాష్ట్రపై పోరాటం చేసిన యోధుడు చంద్రబాబు అని మంత్రి ప్రత్తిపాటి కొనియాడారు