నాన్న ఆశయాలే నాకు మార్గదర్శనం

SMTV Desk 2018-09-02 17:02:07  YS Jagan, YSR Rajasekhar Reddy

నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 9వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్, ఆయన విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు.నాన్న ఆశయాలే నాకు మార్గదర్శనం. ఆయన ఆశయ సాధన కోసం నా జీవితాన్ని అంకితమిస్తాను’అని వైఎస్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు. కాగా, కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ స్మారకం వద్ద పలువురు వైకాపా నేతలు నివాళులు అర్పించారు. వైఎస్ సతీమణి విజయమ్మ, జగన్ సతీమణి భారతి, సోదరి షర్మిల తదితరులతో పాటు పలువురు నేతలు నివాళులు అర్పించారు.