ఏపీ బ్రాండ్‌గా బొంగు బిర్యానీ..

SMTV Desk 2018-07-10 11:11:34  bongu biryani, ap bongu biryani, visakhapatnam, hyderabad

అమరావతి, జూలై 10 : బొంగులో చికెన్ పేరు వింటే చాలు విశాఖ మన్యంలోని పర్యాటక ప్రాంతాల్లోని పర్యాటకుల నోళ్లూరుతాయి. విశాఖ ఏజెన్సీలోని అరకు లోయ నుంచి మారేడుమిల్లి వరకు పర్యటక ప్రాంతాల్లో ఈ చికెన్ అందుబాటులో ఉంటుంది. కొంతమంది గిరిజనులకే ఈ చికెన్ తయారీ సాధ్యం. బొంగు బిర్యానీ కూడా ఇలాగే తయారు చేస్తారు. తాజాగా బొంగు బిర్యానీకి ప్రచారం కల్పించడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీ బ్రాండ్‌గా బొంగు బిర్యానీని ప్రచారంలోకి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఓ కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. ప్రపంచవ్యాప్తంగా బిర్యానీ అనగానే హైదరాబాద్‌నే గుర్తు చేసుకుంటారు. బొంగు బిర్యానీ అనగానే ఏపీని గుర్తుచేసుకునే స్థాయిలో ప్రచారం కల్పించి, దీన్ని విస్తృత వినియోగంలో తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం చెఫ్‌లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆంధ్రా వంటకాలకు మరింత ప్రాచుర్యం కల్పించడానికి వార్షిక ప్రణాళికను పర్యాటక శాఖ సిద్ధం చేసింది.