శ్రీకాకుళం జిల్లాలో పిడుగుపాటుకు ఐదుగురు దుర్మరణం

SMTV Desk 2018-05-13 16:52:24  srikakulam, thunders heavy rain in srikakulam, l.n peta, thunders rain

శ్రీకాకుళం, మే 13 : శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షంతో వాతావరణం ఒక్క సారి మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన వర్షంతో పాటు ఉరుములు, మెరుపులకు తోడు పిడుగులు పడ్డాయి. పిడుగుల ధాటికి జిల్లా వ్యాప్తంగా ఐదుగురు మృతి చెందారు. పాతపట్నం మండలం తిడ్డిమిలో పిడుగుపడి ఇద్దరు మృతిచెందగా, మెళియాపుట్టి మండలం పెద్దలక్ష్మీపురం బస్టాండ్‌ వద్ద పిడుగుపడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎల్‌.ఎన్‌.పేట మండలం పెద్దకొల్లివలసలో చెరువులో చేపలవేటకు వెళ్లిన అప్పలనర్సయ్య (55) పిడుగుపాటుకు మృతి చెందాడు. పాలకొండ, రేగిడి, వంగర, సంతకవిటి, బూర్జ, పొందూరు, నరసన్నపేట, కోటబొమ్మాళి, జలుమూరు, సంతబొమ్మాళి, పాతపట్నం, శ్రీకాకుళం, టెక్కలి మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. జిల్లాలో భారీగా వర్షం పడుతుండటంతో యంత్రాంగం అప్రమత్తమైంది.