చంద్రబాబును జైల్లో పెట్టించే వరకూ నిద్రపోను

SMTV Desk 2018-04-30 15:45:02   Will Send Chandrababu To Jail Says VIjayasai Reddy

విశాఖపట్టణం, ఏప్రిల్ 30: భారీగా అవినీతికి పాల్పడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూలదోస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును జైల్లో పెట్టించే వరకూ నిద్రపోనని వైఎస్సార్‌ సీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అన్నారు. దేశంలోని హవాలా, విదేశాల్లోని ఆర్మ్‌డ్‌ డీలర్స్‌తో చంద్రబాబుకు సంబంధాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం విశాఖపట్నం వేదికగా చేపట్టిన ‘వంచన వ్యతిరేక దీక్ష’ సభాప్రాంగణం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. 2014 ఏప్రిల్‌ 30న తెలుగుదేశం పార్టీ చేపట్టిన సభకు, ఈ ఏడాది ఏప్రిల్‌ 30న చేపట్టిన సభ లక్ష్యాలు పూర్తి విభిన్నంగా ఉన్నాయని అన్నారు. తిరుపతిలో నిర్వహిస్తున్నది ‘ధర్మపోరాటదీక్ష’ కాదని, అదొక అధర్మ సభ అని దుయ్యబట్టారు. చంద్రబాబు అవినీతిపై ప్రధానమంత్రికి ఆధారాలను సమర్పిస్తానని చెప్పారు. అవినీతికి కేర్‌ ఆఫ్‌ అడ్రస్‌గా మారిన చంద్రబాబును జైల్లో పెట్టించే వరకూ నిద్రపోనని అన్నారు.