ఏపీ డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల చేసిన గంటా

SMTV Desk 2018-04-28 11:29:07  ap dsc schedule, minster ganta srinivasa rao, ap dsc, sgt

అమరావతి. ఏప్రిల్ 28 : ఏపీ మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు డీఎస్సీ షెడ్యూల్‌ విడుదల చేశారు. జులై 6న డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు.ఆరు కేటగిరీల్లో (ఎస్‌జీటీ, ఎస్‌ఏ, పీఈటీ, ఎల్‌పీ, మ్యూజిక్) మొత్తం 10,351 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఏపీపీఎస్సీ ద్వారా డీఎస్సీ నిర్వహించాలని భావిస్తున్నామని వెల్లడించారు. టెట్‌, డీఎస్సీల సిలబస్‌ను వారంలోగా వెల్లడిస్తామని.. మే 4న టెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ వివరాలు నోటిఫికేషన్‌ : 6-7-2018 దరఖాస్తు గడువు : 7-7-2018 నుంచి 9-8-2018 వరకూ హాల్‌ టికెట్స్‌ : 15-08-2018 పరీక్షలు : 23-08-2018 నుంచి 30-08-2018 ( రెండు సెషన్లలో 9.30 నుంచి 12, 2.30 నుంచి 5 గంటల వరకూ పరీక్షలు ) ప్రాథమిక కీ : 31-08-2018 అభ్యంతరాల గడువు : 31-08-2018 నుంచి 07-09-2018 వరకూ ఫైనల్‌ కీ :10-09-2018 తుది ఫలితాలు : 15-09-2018