హైకోర్టులో అగ్రిగోల్డ్‌ కేసు విచారణ

SMTV Desk 2018-04-25 17:02:08  High Court Responds On Agri Gold Case

హైదరాబాద్‌, ఏప్రిల్ 25: అగ్రిగోల్డ్‌ కేసును హైకోర్టు విచారణ చేపట్టింది. ఇందుకు సంబంధించి బుధవారం హైకోర్టు న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. అగ్రిగోల్డు ఆస్తుల కొనుగోలు విషయంలో జిఎస్సెల్‌ గ్రూప్‌ వెనక్కి తగ్గింది. దీంతో పిటిషనర్‌ , కోర్టు విలువైన సమయాన్ని వృధా చేసినందుకు గానూ జీఎస్సెల్‌ గ్రూప్‌పై పెనాల్టీ వేయాలని అఫిడవిట్‌ దాఖలు చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి జీఎస్సెల్‌ గ్రూపుకు చివరి అవకాశం ఇచ్చారు. జూన్‌ 5 నాటికి రూ.1000 లేదా 1500 కోట్లు డిపాజిట్‌ చేయాలని ఆదేశించారు. లేని పక్షంలో రూ.100 కోట్ల విలువ చేసే అగ్రిగోల్డ్‌ 10 ఆస్తులను గుర్తించి ప్రభుత్వం వేలం వేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్‌ 5కు హైకోర్టు వాయిదా వేసింది.