వైజాగ్ లో వర్షం..పట్టణ వాసులకు ఊరట

SMTV Desk 2018-04-24 15:16:25  Rain in vizag, weather, cool

వైజాగ్, ఏప్రిల్ 24: భానుడి ఉగ్రరూపం దాల్చడంతో ఎండవేడిమితో ఇబ్బంది పడుతున్న వైజాగ్ వాసులను వరుణుడు కరుణించాడు. గత రెండు రోజులుగా ఉత్తరాంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో వర్షం పడగా, నేడు వైజాగ్ ను కూడా వర్షం పలకరించింది. దీంతో ఎండవేడిమికి తల్లడిల్లిన వైజాగ్ వాసులను చల్లనిగాలులు సేదదీర్చాయి. అకస్మాత్తుగా వైజాగ్ ను మేఘాలు కమ్ముకోవడంతో, వివిధ ప్రాంతాల్లో వర్షం కురిసింది. పెందుర్తి, కొత్తవలస, గోపాలపట్నం, సింహాచలం తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురవగా, ఎన్ఏడీ జంక్షన్, రైల్వేస్టేషన్, జగదాంబ తదితర ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి