ప్రధాని మోదీ ట్వీట్‌కు లోకేష్ స్పందన

SMTV Desk 2018-04-19 14:04:24  naralokesh tweet, narendra modi, nara lokesh, tdp, bjp

అమరావతి, ఏప్రిల్ 19 : దేశ ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్ పై ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖల మంత్రి నారాలోకేష్ స్పందించారు. ఏపీ హోదాకు ఇచ్చిన 18 హామీలు నెరవేర్చాలని చట్టంలో పొందుపర్చిన విషయం మేము గుర్తు చేసినందుకు దానికి బదులుగా మాపై బీజేపీ నాయకులు అసత్య ఆరోపణలు చేశారని ఆయన వెల్లడించారు. ఇది ఎంత వరకు సబబు అని లోకేష్ ప్రశ్నించారు. సరైన పరిశోధన, ఆధారాలు లేకుండానే తనపై అవాస్త ఆరోపణలు చేయడం బాధాకరమని ఇంతకుముందు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.