ఆ 13 రైళ్లు ఆరు నెలల పాటు రద్దు!

SMTV Desk 2019-12-14 12:05:09  

దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. 2020 జనవరి 1 నుంచి జూన్ 30 వరకూ పలు మార్గాల్లో తిరిగే డెమో రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. 13 రైళ్లను రద్దు చేస్తున్నట్టు ఎస్సీఆర్ అధికారి సిహెచ్ రాకేశ్ వెల్లడించారు. రైళ్ల వివరాలు.. సికింద్రాబాద్‌ మేడ్చల్‌ సికింద్రాబాద్‌ డెము ప్యాసింజర్‌, ఫలక్‌ నుమా మేడ్చల్‌ ఫలక్‌నుమా డెము ప్యాసింజర్‌ , ఫలక్‌ నుమా ఉమ్దా నగర్‌ ఫలక్‌ నుమా డెము ప్యాసింజర్‌ , బొల్లారం ఫలక్‌ నుమా బొల్లారం డెము ప్యాసింజర్‌ రద్దయిన రైళ్ల జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు ఫలక్‌ నుమా మనోహరాబాద్‌ సికింద్రాబాద్‌ డెము ప్యాసింజర్‌ , సికింద్రాబాద్‌ ఉమ్దా నగర్‌ డెము ప్యాసింజర్‌ , ఉమ్దా నగర్‌ ఫలక్‌ నుమా ఉమ్దా నగర్‌ డెము ప్యాసింజర్‌, ఫలక్‌ నుమా భువనగరి ఫలక్‌ నుమా ప్యాసింజర్‌ రైళ్లు కూడా ఆరు నెలల పాటు రద్దు చేశారు. మరోవైపు కొన్ని రైళ్లను పాక్షికంగానూ రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిసెంబర్ 16 నుంచి మార్చి 15 వరకూ బోధన్‌ మహబూబ్‌ నగర్‌ ప్యాసింజర్‌ షాద్ నగర్ వరకు మాత్రమే నడపనున్నారు. మహబూబ్‌ నగర్‌ కాచిగూడ ప్యాసింజర్‌ రైలు కూడా షాద్‌ నగర్‌ వరకే పరిమితం కానుంది. మేడ్చల్‌ కాచిగూడ ప్యాసింజర్‌ను మేడ్చల్, బొల్లారం మధ్య రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.